Devara movie: వచ్చే ఏడాది జపాన్ లో రిలీజ్ కానున్న దేవర..! 9 d ago
ఇండియన్ సినిమాలు ఈ మధ్య జపాన్ లో సంచలన విజయాలు అందుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన "కల్కి 2989ఏడీ" వచ్చే నెల 3న జపాన్ లో రిలీజ్ కు సిద్ధం కాగా, తాజాగా ఎన్టీఆర్ "దేవర" మూవీ కూడా ఈ వరుసలో చేరింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన "దేవర" మూవీ ని 2025 మార్చ్ 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్లు ప్రకటించారు. దీనికి సంబంధించి టికెట్స్ జనవరి 3నుండి అందుబాటులోకి రానున్నాయి.